తెలంగాణ

రేషన్ దందా.. సిరిసిల్లలో 250 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.అక్రమంగా నిల్వ చేసిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనకదుర్గ ట్రేడర్స్ రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారులు ఇవాళ ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వ చేసినందుకు కనకదుర్గ ట్రేడర్స్ లైసెన్స్ సీజ్ చేసినట్టు సమాచారం.పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సేఫ్ కస్టడీ కోసం వాసవి ట్రేడర్స్‌కు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్ఓ బుచ్చిబాబు హెచ్చరించారు.