తెలంగాణ
250 రోజుల ఆలస్యం.. విద్యాశాఖ అధికారులకు హైకోర్టు షాక్!
ఒక కేసులో అప్పీల్ దాఖలు చేయడానికి ఏకంగా 250 రోజుల కాలయాపన చేసిన తెలంగాణ పాఠశాల విద్యాశాఖపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ విద్యాశాఖకు రూ.25వేల జరిమానా విధిస్తూ డివిజన్ బెంచ్ చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ జరిమానా మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, అప్పీల్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆలస్యానికి కారకులైన అధికారుల జీతాల నుంచే వసూలు చేయాలని స్పష్టం చేసింది.
