ప్రపంచం

జావా సముద్రంలో మునిగిన నౌక.. 240 మంది గల్లంతు!

ఇండోనేషియాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక అకస్మాత్తుగా గల్లంతయ్యింది. దీంతో వందల మంది నడిసంద్రంలో గల్లంతు అయినట్టు సమాచారం. విషయం తెలియడంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. ఇండోనేషియా తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ కలిమంతన్ ప్రాంతంలోని బంజర్మసిన్‌కు ప్రయాణికులతో బయలుదేరిన విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 నౌక అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంది. సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్స్ కోల్పోయి, కమ్యూనికేషన్ కట్ అయినట్టు తెలిసింది. ఆ సమయంలో నౌకలో సుమారు 240 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.