తెలంగాణ
22ABanLands: నిద్రమత్తు వీడిన సర్కార్.. 22-ఏ భూసమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ!
తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో చిక్కుకున్న భూముల సమస్యలను శాశ్వతంగా తేల్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిబంధనల పేరుతో భూ యజమానులు అనుభవిస్తున్న నరకయాతనకు ముగింపు పలుకుతూ, క్షేత్రస్థాయి విజ్ఞప్తులను పరిశీలించేందుకు గాను ముగ్గురు ఉన్నతాధికారుల నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో నిషేధిత జాబితా ఉచ్చులో చిక్కుకుని, కష్టపడి కొనుక్కున్న సొంత భూమిపై ఎలాంటి హక్కులూ లేక అల్లాడుతున్న లక్షలాది మంది సామాన్యులకు పెద్ద ఊరట లభించనుంది.
