తెలంగాణ

22A జాబితాపై సమగ్ర విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు!..

తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వరుసగా స్వేచ్ఛ న్యూస్లో వెలువడుతున్న కథనాలతో ఈ అంశంపై ప్రభుత్వం కూడా స్పందిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు 22A భూముల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22A జాబితాపై సమగ్ర విచారణ చేపడతామని.. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు 22A జాబితాలో ఏం జరిగింది? దీని వెనుక ఎవరి పాత్ర ఉంది? త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.