తెలంగాణ
22A Scam: ‘పొంగులేటిని బర్తరఫ్ చేయాలి..’ రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ!
తెలంగాణ రెవెన్యూ శాఖలో నిషేధిత భూముల (22A) చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ పెద్దలు, దళారులు బరితెగించి సాగిస్తున్న వేల కోట్ల రూపాయల దోపిడీ, 30శాతం కమీషన్ల దందాపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను కృత్రిమ వివాదాల్లోకి నెట్టి వేధింపులకు గురిచేస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
