తెలంగాణ

22A Lands Row: డిఫెన్స్ కాలనీ సొసైటీ భూములపై కీలక విజయం

22ఏ జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఈ క్రమంలోనే డిఫెన్స్ హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ (O/R) లిమిటెడ్, డిఫెన్స్ కాలనీకి చెందిన సుమారు A.112:03 గుంటల భూమికి సంబంధించి కీలకమైన పరిపాలన, చట్టపరమైన పురోగతి లభించింది. సొసైటీ తరపున నిరంతర ప్రయత్నాలు, సంబంధిత అధికారులతో సమన్వయం, అవసరమైన పత్రాల సమర్పణ, చట్టపరమైన ఫాలోఅప్ తర్వాత సొసైటీ భూములకు సంబంధించి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి అవసరమైన NOC (నిరభ్యంతర ధృవీకరణ పత్రం) మంజూరు అయ్యింది. అదే విధంగా సొసైటీ భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది.

కాగా, 22 ఏ నిషేధిత జాబితా నుంచి మీ భూములు, ప్రాపర్టీలు తొలగిస్తామని కొందరు బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అటువంటి వారిని నమ్మి డబ్బులు చెల్లించొద్దని స్వేచ్ఛ న్యూస్ హెచ్చరిస్తోంది.