తెలంగాణ

22A Lands Row: 22ఏ వివాదం.. ఆందోళన వద్దు.. నెలాఖరు వరకు పరిష్కరిస్తాం

22A Lands Row: 22 ఏ నిషేదిత జాబితా అప్ డేట్ లో అధికారుల పొరపాటుతో ఇబ్బందులు వచ్చాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇప్పటికే 22 ఏ రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. నిన్న దాదాపు 5కు పైగా 22ఏ జాబితా రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శిస్తానని మీడియాతో చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి వెల్లడించారు.