తెలంగాణ
22A Lands: మీ భూమి ఎక్కడికీ పోదు- 22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
22A Lands: 22ఏ భూముల అంశంలో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో 22ఏ భూములపై సీఎం రేవంత్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొనుగోలు చేసిన భూమి ఎక్కడికీ పోదన్నారు. అందుకు నాదీ భరోసా అని చెప్పారు. 22ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది అని రేవంత్ తేల్చి చెప్పారు. అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లకు ఆదేశాలు ఇస్తానన్నారు.
