స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
22A Land Issue: అందరూ 22 A బాధితులే.. రండి చర్చిద్దాం.. నిలదీద్దాం!!
హైదరాబాద్ మహానగరంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం పేరిట ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన 22A నిషేధిత భూముల ఉత్తర్వులపై భూ బాధితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎలాంటి ముందస్తు విచక్షణ లేకుండా గుట్టలబేగంపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ల మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంపై స్థానిక ప్రజలు, కాలనీవాసులు మండిపడుతున్నారు. కాకతీయ హిల్స్, సైబర్ హిల్స్, ప్రిస్టన్ విల్లాస్ వంటి ప్రధాన కాలనీల నివాసితులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందడంతో కాకతీయ హిల్స్ పార్క్లో మార్నింగ్ వాక్కు వచ్చిన బాధితులంతా ప్రభుత్వ తీరుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
