తెలంగాణ

కబ్జాల పై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్.. 22Aలోకి 522 ఎకరాల ఇనాం భూములు!..

గతంలో ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన ఇనాం భూములను తిరిగి ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్ మండలాల్లోని భూములపై అధికారులు దృష్టి సారించారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో సుమారు 400 ఎకరాలు, నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 122 ఎకరాల ఇనాం భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్సీలు, ఎన్ఓసీలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపట్టి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.