తెలంగాణ

22ఏ వివాదం.. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్

Toll Free Number: 22ఏ నిషేధిత భూముల అంశం తీవ్ర వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. అనంతరం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. నిషేధిత భూముల అంశంలో ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788 కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి పొంగులేటి తెలిపారు.