తెలంగాణ

22ఏ భూ బాధితుల సమావేశం.. ప్రధానంగా 4 తీర్మానాలు ప్రతిపాదన

22A Lands: హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ధరణి, భూ భారతి, 22ఏ సృష్టించిన సమస్యలపై.. చర్చిద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపుదాం పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్లు, 30 మంది వరకు భూ బాధితులు పాల్గొన్నారు. ధరణి, భూ భారతి బాధితుల సమావేశం విజయవంతమైంది. ధరణి, భూ భారతి, 22ఏ భూ బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 తీర్మానాలను ప్రతిపాదించారు. ఈ తీర్మానాలను స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల తెలియజేశారు.