తెలంగాణ
ఆ భూములను 22ఏ నుంచి తొలగిస్తాం- సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ (22A Lands)
22A Lands: తెలంగాణలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి హైపవర్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి వారంలోపు సమగ్ర గైడ్‌లైన్స్ తీసుకొస్తామన్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ లేఔట్ల దరఖాస్తులు పరిశీలిస్తామని తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న, కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిష్కరిస్తామని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి వారంలోపు వ్యవస్థ తీసుకొస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు.
