తెలంగాణ

22ఏ కింద..100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు

22ఏ పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేస్తుందో అంతకంటే ఎక్కువ అక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు కవిత. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీశ్ రావు స్కామ్ చేశారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి 100 ఎకరాలను హరీశ్ రావు తన తండ్రి పేరు మీదకు బదలాయించుకున్నారని కవిత చెప్పారు.

22ఏ నిషేధిత జాబితా నుంచి తీసుకుని సిద్ధిపేట పట్టణంలో 100 ఎకరాలు హరీశ్ రావు తన తండ్రి పేరు మీద బదలాయించుకున్నారన్న కవిత.. అందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని రేవంత్ ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే దానిపై చర్చ పెట్టాలని, హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.