National
2047 నాటికి వికసిత భారత్.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ సరికొత్త శపథం!
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్కు స్వాతంత్య్రం సిద్ధించి వంద ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని పూర్తిస్థాయి 'అభివృద్ధి చెందిన దేశంగా' (వికసిత భారత్) తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. దేశం సరికొత్త ఆత్మవిశ్వాసంతో, అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహనీయులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, మహాత్మా గాంధీకి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు.
