National
పదేళ్లలో ఊహించని ఫలితాలు.. 2030 నాటికి భారత్లో ఆ వ్యాధి ఉండదు!
మలేరియా మహమ్మారిపై సాగిస్తున్న పోరాటంలో భారతదేశం అత్యంత గణనీయమైన పురోగతిని సాధించింది. గత పదేళ్ల కాలంలో (2015 నుంచి 2025 వరకు) దేశంలో మలేరియా కేసులు మరియు దాని వల్ల సంభవించే మరణాలు ఏకంగా 80 శాతం మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన నివేదికలో స్పష్టం చేసింది. ఒకప్పుడు మలేరియా తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల సంఖ్య 155 ఉండగా, ప్రస్తుతం అది 33కి పడిపోవడం విశేషం. అంతేకాకుండా, 2022 నుంచి 2025 మధ్యకాలంలో దేశంలోని సుమారు 160 జిల్లాల్లో ఒక్క స్థానిక మలేరియా కేసు కూడా నమోదు కాకపోవడం భారత్ సాధించిన సాధనకు నిదర్శనం.
