National

కేరళ యువతికి 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' కిరీటం..!

అందాల పోటీల వేదికపై భారతదేశం తరఫున మరో యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక జాతీయ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది విజేత మణికా విశ్వకర్మ ఆమెకు కిరీటం తొడిగి అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు. ఇక ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ రెండో స్థానంలో నిలవగా, గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతావలేకర్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.