తెలంగాణ
20:20 ఫైనల్కు శంఖారావమా?..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గతంలో కొన్ని స్థానాల్లో మాత్రమే అనుకూల ఫలితాలు రావడంతో.. ఈసారి ఎన్నికలు సీఎంకు సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుని సిటీ ఓటర్లను తనవైపు తిప్పుకునే వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కూడా అధికార పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిపక్షాలపై రాజకీయ పోరుకు వేదికగా మార్చేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
