తెలంగాణ
ట్రాఫిక్‌లోనే 200 గంటలు.. నరకం చూస్తున్న హైదరాబాదీలు!
హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పుణ్యమా అని వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితికి నగరంలో ట్రాఫిక్ పెరిగింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నరకప్రాయమే. వాహనాలు ఆగిపోయాయంటే గంటల కొద్దీ వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. చిన్నా పెద్దా తేడా లేకుండా ట్రాఫిక్‌లో అవస్థలు పడాల్సిందే. అయితే, సగటున ఓ మనిషి హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.సగటు హైదరాబాదీ ఏడాదికి 200 గంటల విలువైన తన సమయాన్ని కేవలం రోడ్ల మీద, వాహనాల రద్దీ మధ్యే గడిపేస్తున్నాడని తాజా ట్రాఫిక్ ఇండెక్స్ సర్వే తెలిపింది. ఈ సర్వే వాస్తవాలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
