National
టచ్‌లో 200 మంది అధికారులు.. ప్రకంపనలు సృష్టిస్తున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు!
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 200మంది ఉన్నతాధికారులు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ (CBI)తో పాటు విదేశాంగ శాఖకు చెందిన అధికారులు కూడా ఉన్నారని, వారే ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని తమకు అందిస్తున్నారని వెల్లడించారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు వైపు ఇండీ (INDIA) కూటమి చేపట్టిన భారీ నిరసన మార్చ్‌కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
