National
National : డీజే సౌండ్స్‌కు 20 రోజుల పసికందు మృతి
డీజే సౌండ్ దెబ్బకు ఓ చిన్నారి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ తీవ్ర విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా ముడియారీ గ్రామం మనియార్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. లక్ష్మీ విగ్రహం నిమజ్జన ఊరేగింపులో భాగంగా డీజే సిస్టమ్ అమర్చిన ట్రక్కు ఓ ఇంటి ముందు ఆగింది.భారీ శబ్దంతో డీజే ప్లే చేస్తుండగా ఇంట్లో 20 రోజుల పసికందు ఉందని, శబ్దం తగ్గించాలని తల్లి రీమా దేవి వేడుకుంది. కనీసం వాహనాన్ని అయినా ముందుకు తీసుకెళ్లాలని వేడుకున్నా నిర్వాహకులు పట్టించుకోలేదు. అయితే, భారీ శబ్దాలకు గాను పసికందు గుండె ఆగిపోయి కన్నుమూసింది.కళ్ల ముందే పసికందు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
