National

1991 Budget India: ఆ ఒక్క బడ్జెట్ లేకపోతే మన దేశం ఏమయ్యేదో? 35 ఏళ్ల కిందట ఏం జరిగిందంటే!

సరిగ్గా 35 ఏళ్ల కిందట.. అంటే 1991 జూలై 24న మన దేశంలో ఓ అద్భుతం జరిగింది. అప్పట్లో భారతదేశం తీవ్రమైన డబ్బుల కొరతతో దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. కనీసం విదేశాల నుంచి పెట్రోల్ కొందామన్నా.. మన దగ్గర పైసలు లేవు. దేశంలో ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి అప్పులు తేస్తే కానీ గడవని దారుణమైన పరిస్థితి.