తెలంగాణ
1500 మంది పోలీసుల పహారాతో పెద్ది సుదర్శన్ విగ్రహం కూల్చివేత!
నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నిన్న అర్ధరాత్రి కూల్చివేశారు. భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత కొనసాగినట్టు తెలుస్తోంది. నర్సంపేట పట్టణంలోని మెడికల్ కాలేజీ సమీపంలో బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాన్ని అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని మున్సిపల్ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే,పెద్ది విగ్రహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికే సిటీలో చాలా వరకు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఉన్నాయని, మరి వాటిమీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, నిన్నరాత్రి సుమారు 1500 మంది పోలీసుల భద్రత నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్టు సమాచారం.
