తెలంగాణ
150 ఏళ్లలో లేని కరవు.. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న తీవ్ర మార్పుల వల్ల గత 150 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం (ఎల్నినో) వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి, దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
