క్రైమ్
ఒక్క ఫోన్ కాల్.. 1.5 కోట్లు మాయం!..
విశాఖలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 76 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి దంపతులను భయపెట్టి.. వారి జీవితకాల పొదుపు సుమారు రూ.1.5 కోట్లకు పైగా కాజేశారు సైబర్ నేరగాళ్లు. పోలీస్, సీబీఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్ చేసి.. ఆర్బీఐ ఫండ్ వెరిఫికేషన్ పేరుతో డబ్బును వివిధ ఖాతాలకు బదిలీ చేయించారు. ఈ కేసులో కేరళకు చెందిన కమీషన్ ఏజెంట్ షబ్బీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
