సాగరహారానికి 14 ఏండ్లు.. స్వరాష్ట్ర కాంక్షకు నిలువెత్తు నిదర్శనం : కేసీఆర్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన ఘట్టం 'సాగరహారం'(తెలంగాణ మార్చ్). ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ మహా ప్రదర్శనను చేపట్టారు. ఈ కార్యక్రమం జరిగి నేటితో 14 సంవత్సరాలు పూర్తయింది. ఇది 2012 సెప్టెంబర్ 30న హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్), నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో పెద్దఎత్తున నిర్వహించారు. ఈ క్రమంలోనే నాటి సాగరహారాన్ని గుర్తుచేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాట రూపం సాగరహారం. ఆంక్షలను, నిర్బంధాలను, ముళ్లకంచెలను, లాఠీచార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్క చేయకుండా... తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 30, 2012 నాటి సాగరహారం. సబ్బండ వర్గాలు హుస్సేన్ సాగర్ తీరాన చేసిన చారిత్రాత్మక సాగరహారానికి 14 ఏళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు ఉద్యమాభివందనాలు’ అని రాసుకొచ్చారు.
