International
పాక్లో 125 ఏళ్లనాటి పురాతన ఆలయం కూల్చివేత.. తీవ్ర నిరసనలు!
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్, నరోవల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన హిందూ దేవాలయం కూల్చివేతకు గురికావడం తీవ్ర వివాదానికి దారితీసింది. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చారిత్రక ఆలయాన్ని ఆగస్టు 21న నిషేధిత తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ) పార్టీకి చెందిన మత ఛాందసవాదులు ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
