National

'మన్ కీ బాత్'కు 12ఏళ్లు.. 139వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!

 ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' (Mann Ki Baat) విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రసారమైన 139వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ భావోద్వేగంతో ప్రసంగించారు. గత పన్నెండు సంవత్సరాల ప్రయాణం తనకెంతో మధురమైన అనుభూతిని మిగిల్చిందని, ఇది సాధారణ ప్రయాణం కాదని, దేశ ప్రజలను దగ్గరగా అర్థం చేసుకునే ఒక 'పవిత్ర తీర్థయాత్ర'తో సమానమని భావోద్వేగంతో వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ కృషితో సమాజానికి సేవ చేస్తున్న సామాన్యుల స్ఫూర్తిదాయక గాథలను ఈ వేదిక ద్వారా దేశం ముందుంచినట్లు తెలిపారు.