తెలంగాణ

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్.. 11 రోజులు అక్కడే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించనున్నారు. ముందుగా యూకే వెళ్లనున్నారు. ఆ తర్వాత అమెరికాలో పర్యటిస్తారు. మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ‌పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి సీఎం సహా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వంశీచందర్ రెడ్డిలు ఈ మీటింగ్ లో పాల్గొంటారు.