వైరల్ న్యూస్

100 Horns Bike: ఇది బైకా? హారన్ల షాపా? ఒకే బైకుకు 100 హారన్లు.. పోలీసులే షాక్

100 Horns Bike: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో వాహన తనిఖీల సమయంలో పోలీసులకు ఓ బైక్ కంటపడింది. ఆ బైక్ ను చూసి పోలీసులే పరేషాన్ అయ్యారు. ఇదెక్కడి విడ్డూరం అని ముక్కున వేలేసుకున్నారు. వారలా షాక్ అవడానికి కారణం ఆ బండికి 100 హారన్లు ఉండటమే. ఈ చిత్రవిచిత్రమైన బైక్ ను చూసి స్థానికలే కాదు పోలీసులు సైతం విస్తుపోయారు. రూల్స్ కు విరుద్ధంగా ఉందంటూ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బైక్ ను సీజ్ చేసేశారు.