రాజకీయాలు
రూ.100 కోట్లకుపైగా భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టిన రేవంత్ : క్రిశాంక్
సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారని ఆరోపించారు. కొండల్ రెడ్డి సూట్ వెయ్యగానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ అయిపోయారా? అంటూ ప్రశ్నించారు. సోమవారం బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్.. పలు అంశాలను ఈ సందర్బంగా ప్రస్తావించారు. రేవంత్ సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ బాగోతాన్ని మన్నె క్రిశాంక్ బయటపెట్టారు. ఈ డొల్ల షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి అమెరికా వాళ్లను కూడా మోసం చేస్తున్నారని, వాళ్లతో సమావేశం పెడుతున్నారని ఆరోపించారు.
