తెలంగాణ
భూములమ్మి 10లక్షల కోట్లు సంపాదించాలని కుట్ర
తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైన భూ చట్టం వస్తుంది అనుకున్నామని కానీ అందుకు భిన్నంగా జరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో.. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టు అయ్యిందన్నారు. పేదలకు భూములపై హక్కులను కాలరాశారని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వాళ్ల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. ధరణిని రద్దు చేస్తాం, బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. రద్దు దేవుడెరుగు.. ఇప్పుడు తెచ్చిన భూభారతి పేదలను నిండా ముంచిందని ధ్వజమెత్తారు.
