International
మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..
దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని లాపాజ్ సమీపంలోని ఓ మిలటరీ బ్యారక్స్‌లో జరిగిన భారీ పేలుడులో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. లాపాజ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియాచా మున్సిపాలిటీలోని సైనిక స్థావరంలో ఈ పేలుడు సంభవించింది.
