క్రైమ్
రూ.10 వేల కోసం మొండికేశాడు.. రూ.24 కోట్ల భారీ నష్టం!
కొందరు వ్యాపారులు చేసే చిన్న చిన్న తప్పిదాలు ఏకంగా రూ. కోట్ల నష్టానికి దారి తీసేలా చేస్తుంటాయి. అది వ్యాపారంలో తీసుకునే సలహా విషయంలో కావొచ్చు లేదా తమ కింద పనిచేసే వారితో వ్యవహరించే విధానం వల్లైనా కావొచ్చు.వ్యాపారంలో లాభం రావాలన్నా, నష్టం రావాలన్నా ఓనర్లు కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అందరితో నమ్మకంగా వ్యవహరించాలి. ఉద్యోగుల జీతం విషయంలో ఆలస్యం చేయకూడదు. తమ కింద పనిచేసేవారి పట్ల చిన్న చూపు పనికిరాదు. కాగా, ఓ ఉద్యోగికి చెల్లించాల్సిన వేతనం విషయంలో ఆలస్యం కారణంగా ఓ యజమాని భారీగా నష్టపోయాడు. రూ.10వేలు జీతం చెల్లించడం లేదని ఏకంగా షాపులకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్‌లో వెలుగుచూసింది.
