International
హెచ్-1బీ వీసాలపై ట్రంప్ మరో షాక్..1 లక్ష డాలర్ల ఫీజు పొడిగిస్తూ కీలక నిర్ణయం!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ (H-1B) వీసాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కేటగిరీల హెచ్-1బీ దరఖాస్తులకు విధించిన 1లక్ష డాలర్ల (సుమారు రూ.84 లక్షలు) భారీ రుసుమును మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనికితోడు హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేసే కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తున్నాయా లేదా అనే అంశంపై కఠినమైన నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. విదేశీ నిపుణులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా వైట్‌హౌస్ ఈ చర్యలు చేపట్టింది.
