సినిమా

Anil Ravipudi: నాగార్జునతో సినిమా కష్టమేనా?

4 నిమిషాల పఠనం

Anil Ravipudi: హిట్ మిషన్ అనిల్ రావిపూడి ప్రస్తుతం జనవరి 12 విడుదల సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటీవల, ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కోసం ప్రధాన తారాగణం అయిన విక్టరీ వెంకటేష్, కీర్తి సురేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టి కజికిస్తాన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే, అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా కింగ్ నాగార్జునతో ఉండబోతుందని నిన్నామొన్నటి వరకూ వార్తలు రాగా, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

నాగార్జున ప్రస్తుతం తన మైల్ స్టోన్ మూవీ కింగ్ 100 చిత్రాన్ని సొంత బ్యానర్‌లో నిర్మిస్తూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తమిళ యువ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత టబు ఇందులో నాగార్జునతో మళ్ళీ జత కట్టింది. వీరిద్దరి పాత్రలు అద్భుతంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. పెద్దగా కింగ్ 100 నించి అప్‌డేట్స్ ఇవ్వకపోయినా కూడా వచ్చిన టబు ఇంట్రో వీడియోతో అంచనాలు బాగానే పెరిగాయి.

ఇక, రా.కార్తీక్ ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఇదే ఏడాది డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆరకంగానే సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నాడు. దీని, తర్వాత నాగ్..అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తాడనే ప్రచారం ఉంది. ఈ హిట్ మిషన్ కూడా టాలీవుడ్‌లో సీనియర్స్‌తో పాటు యంగ్ హీరోలతోనూ సినిమాలు తీసి హిట్ కొట్టాడు. సీనియర్స్‌లో మిగిలింది ఒక్క నాగార్జున మాత్రమే.

ఆయనతో కూడా అనిల్ రావిపూడి సినిమా చేస్తే గ్యారెంటీగా ఎవరికీ దక్కని ఫీట్ ఈయన సాధించనట్టే. కానీ, ఇప్పట్లో ఆ ఛాన్స్ లేదని టాక్ మొదలైంది. ఇప్పటికే, దిల్ రాజు..అనిల్ నెక్స్ట్ సినిమాను తన బ్యానర్‌లో చేయడానికి అడ్వాన్స్ ఇచ్చాడట. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి..నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా దిల్ రాజు దగ్గరున్నాయట. ఈ ముగ్గురిలో ఎవరితోనైనా అనిల్ రావిపూడి కథ సెట్ చేస్తే వెంటనే ప్రాజెక్ట్ మొదలవుతుంది. కాబట్టి, ఇంకో ఏడాది వరకూ అనిల్ రావిపూడి-నాగార్జునల కాంబోలో సినిమా సెట్ కాకపోవచ్చంటున్నారు.

#Anil Ravipudi#Nagarjuna#Tollywood#Latest Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి