తెలంగాణ
ys sharmila: వైఎస్ షర్మిల కూతురు వివాహం.. ఎవరీ రఘురామ్..?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో మరోసారి పెళ్లి సందడి నెలకొననుంది. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో 2024లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయం అయినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. దీంతో షర్మిల కుటుంబంలో మరోసారి పెళ్లి వేడుకలు అంగరంగ వైభంగా జరగనున్నాయి.
తాజాగా షర్మిల తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
