క్రీడలు
'నువ్వు అద్దంలో చూసుకుంటావ్'.. మైక్ ముందే కొట్టుకున్న మాజీ క్రికెటర్లు!
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా లైవ్ కామెంట్రీ బాక్స్, స్టూడియోల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రెండు ప్రాంతాల నుంచి విశ్లేషణ అందిస్తున్న భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్ మధ్య జరిగిన సంభాషణ ఆన్-ఎయిర్లోనే వాడివేడిగా మారిపోయింది. సరదాగా ప్రారంభమైన ఈ మాటల యుద్ధం ఒక్కసారిగా సీరియస్ రూపు దాల్చడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
