క్రీడలు

Womens Asia Cup: ‘ఆరంభం అదిరింది..’ థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం!

 దుబాయ్ వేదికగా ప్రారంభమైన మహిళల టీ20 ఆసియా కప్‌ 2026లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం నాటి తమ తొలి లీగ్ పోరులో థాయ్‌లాండ్‌ను 94పరుగుల తేడాతో చిత్తు చేసి టోర్నీలో బోణీ కొట్టింది. టాస్ ఓడి ముందస్తు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 159 పరుగులు నమోదు చేసింది. భారత వికెట్ల వరుస పతనంతో మధ్యలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భారీ లక్ష్యాన్నే నమోదు చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 36 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 64 పరుగులు బాది జట్టుకు మంచి పునాది వేసింది.