International
సముద్రంలో ఇంటర్నెట్ కేబుళ్లు కట్ చేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల శత్రుత్వం మళ్లీ క్లైమాక్స్‌కు చేరుకుని, మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఇరాన్‌పై మరోసారి బలమైన సైనిక దాడి చేపట్టేందుకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే గనుక జరిగితే గల్ఫ్ ప్రాంతంలో సముద్ర గర్భంలో ఉన్న సమాచార ఇంటర్నెట్ కేబుళ్లను (Subsea Internet Cables) పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిహెచ్చరికలు జారీ చేసింది. ఈ అనూహ్య పరిణామాలతో పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
