తెలంగాణ

నీటి ట్యాంకులు, జనరేటర్లు.. ప్రభుత్వ హాస్పిటల్స్‌పై సర్కార్ అప్రమత్తం

తెలంగాణలో విద్యుత్, నీటి సమస్యలు మున్ముందు తీవ్రతరం కానున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది.ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా అంతరాయాలు, నీటి కొరత కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 2025 జూలై 3న జనరేటర్ల కొనుగోలుకు రూ.21.96 కోట్ల నిధులు కేటాయించగా.. తాజాగా వాటిని విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 107 ఆసుపత్రుల్లో విద్యుత్ బ్యాకప్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.