తెలంగాణ

మరోసారి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం

తెలుగు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారానికి మరోసారి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సమావేశం కానున్నాయి.కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాల వాటాకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన పరస్పర ఫిర్యాదులు, పోలవరం, టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు సహా ఇతర అంశాలు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి. 26న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, 30న గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన అధికారులు, ఇంజినీర్లు పాల్గొననున్నారు.