తెలంగాణ
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం.. తెలంగాణలో 48.88లక్షల మంది అర్హత పొందినట్లు ప్రకటన!
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా సాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. సవరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనల ఆధారంగా మొత్తం 48,88,076 మంది పౌరులను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించినట్లు మంగళవారం ఆయన అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. జాబితాలో పొరపాట్లు, సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు మొత్తం 92.88 లక్షల నోటీసులు సిద్ధం చేయగా, అందులో 88.52 లక్షలకు పైగా నోటీసులను ఇప్పటికే ఓటర్లకు అందించినట్లు సీఈఓ వివరించారు.
