వైరల్ న్యూస్
సీఎం విజయ్ పేరెంట్స్‌తో త్రిష.. వీడియో వైరల్!
తమిళ సినీ ప్రపంచంతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ జంట ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటోంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ సుదీర్ఘకాలంగా వస్తున్న ఊహాగానాలకు బలాన్నిచ్చేలా చెన్నైలో మరో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలోని చారిత్రాత్మక 'ఫోర్ట్ సెయింట్ జార్జ్' ఆవరణలో తమిళనాడు ప్రభుత్వం అధికారిక వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో హాజరైన విజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా నటి త్రిష హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
