వైరల్ న్యూస్

గర్ల్‌ఫ్రెండ్‌పై కోపంతో కరెంట్ స్తంభమెక్కిన ప్రేమికుడు.. సీన్ కట్ చేస్తే..!

ప్రేమ వ్యవహారాల్లో చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజమే అయినా, ఆవేశంలో కొందరు చేసే విపరీతమైన పనులు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంటాయి. తాజాగా ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి, ఆగ్రహంతో ఏకంగా అత్యంత ప్రమాదకరమైన విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కి తీవ్ర కలకలం సృష్టించాడు. స్ట్రీట్ లైట్ పోల్ పైభాగానికి చేరుకుని ప్రమాదకర స్థితిలో కూర్చోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఎంత వేడుకున్నా అతడు కిందకు దిగేందుకు నిరాకరించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.