వైరల్ న్యూస్
Viral: ఉద్యోగులందరికీ ఐఫోన్.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బాస్!
యూఏఈ (UAE) కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మానవ వనరుల సంస్థ ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ తమ సిబ్బంది పట్ల చూపిన ఉదారత ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష ప్రశంసలు అందుకుంటోంది. కంపెనీ పురోగతికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులందరినీ ఆశ్చర్యపరుస్తూ యాజమాన్యం సరికొత్త మోడల్ ఐఫోన్లను (iPhones) బహుమతిగా ప్రదానం చేసింది. అయితే ఈ ఖరీదైన గిఫ్ట్‌లను అందించిన విధానం అత్యంత ఆసక్తికరంగా మారడంతో, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
