క్రీడలు
గిల్ మ్యాజిక్ క్యాచ్.. క్రికెట్ అభిమానుల ఫిదా!
మైదానంలో గ్రావిటీకి కూడా దొరక్కుండా ప్లేయర్లు గాల్లోకి ఎగిరే క్షణాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బంతి నేలను తాకేలోపు పక్షిలా ఎగిరి దాన్ని క్యాచ్ పట్టే ఆ మెరుపు విన్యాసాలు చూసి ఫ్యాన్స్ నోరెళ్లబెడతారు. రెప్పపాటులో జరిగే ఆ మ్యాజిక్, మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరినీ సీటు అంచున కూర్చోబెట్టడమే కాదు.. సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తుంది. తాజాగా శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు.
