వైరల్ న్యూస్
Viral: బతికుండగానే పెద్దకర్మ.. 900మందికి విందు ఏర్పాటు చేసిన 80ఏళ్ల వృద్ధుడు!
సాధారణంగా ఎవరైనా మృతిచెందాకే వారి ఆత్మశాంతి కోసం కుటుంబ సభ్యులు 13వ రోజున పెద్దకర్మ నిర్వహించడం భారతీయ సమాజంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్పత్ జిల్లాలో ఒక 80ఏళ్ల వృద్ధుడు తరతరాల ఆచారాలకు భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జోరి గ్రామానికి చెందిన చౌదరి బాల్జోర్ సింగ్ అనే వృద్ధుడు తాను బతికుండగానే స్వయంగా తన 'పెద్దకర్మ' వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ వినూత్న కార్యక్రమానికి సుమారు 900 మంది బంధువులు, గ్రామస్తులు, ప్రముఖులు హాజరై సామూహిక విందులో పాల్గొనడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
