ఏపీ
ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలకు బ్రేక్.. అధికారుల కీలక నిర్ణయం!
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ఆదివారం(నేడు) వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రోటోకాల్ దర్శనాల నిలిపివేత అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
